విద్యావిధానం గురించి అవగాహన కావాలి: మువ్వా రామలింగం

నెల్లూరు: రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ విద్యా విధానంపై శుక్రవారం నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం ద్వారా జరిగే ప్రయోజనాలు, విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్య వంటి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో నూతన విద్యావిధానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఈ విద్యావిధానాన్ని ప్రవేశ పెడుతోందని ఆయన అన్నారు.

ఈ దిశలోనే భాగంగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనుందని, దీనిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ పాలసీ అమలు కావడం ద్వారా పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యాతో పాటు నైపుణ్యం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు. అందుకోసం ఈ విధానంపై ముందుగా ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని, ఆ తరువాత విద్యార్ధులకు, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరాలు తెలియ పరచాలని వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.రమేష్‌, ఏడీలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.