మద్యం ప్రియులా.. డ్రింకింగ్ సమయంలో ఈ ఐదు వస్తువులు ఎవాయిడ్ చేయండి

మన దేశ ఆదాయంలో చాలా వరకూ వచ్చేది మందు బాబుల జేబుల నుంచే. లాక్‌డౌన్ పెట్టినా కూడా మందు ఏ టైంలో దొరుకుతుందండీ అని అడిగిన వాళ్లు కూడా మనకు తెలుసు. అలాంటి మందు బాబులతోపాటు ఎప్పుడో ఒకసారి ఒక పెగ్ తాగే వాళ్లైనా సరే మద్యంతో పాటు కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే కడుపు నొప్పి, ఛాతీలో మంట, వాంతులు వస్తాయి. మరి మద్యం ప్రియులు ఏ ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఒకసారి చూద్దామా?

 1. చాక్లెట్
  వైన్‌తో చాక్లెట్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. కానీ ఇలా తినడం చాలా డేంజర్. చాక్లెట్ వల్ల కడుపులో గ్యాస్ సమస్య పెరుగుతుంది. అంతేకాక అసిడిటీ కూడా వస్తుంది.

Fine & Commercial Chocolate: Do You Know The Difference? - Perfect Daily Grind

 1. బీన్స్, రెడ్ వైన్
  రెడ్ వైన్‌తో తాగేప్పుడు బీన్స్ తీసుకోవడం మంచిది కాదు. భోజనానికి ముందు, పానీయాల సమయంలో బీన్స్ తినకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే బీన్స్, పప్పుధాన్యాల్లో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. మద్యం తాగేటప్పుడు ఐరన్ శరీరంలో కలవదు. ఈ కారణంగా అనేక సమస్యలు వస్తాయి.

LaVarenne » Winegrower's Red Beans with Red Wine

 1. వేయించిన ఉప్పగా ఉండే ఆహారం
  డ్రింక్ చేసే సమయంలో మంచింగ్ కోసం చాలా మంది వేయించిన తినుబండారాల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇవి తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. అంతేకాదు శక్తి కూడా సన్నగిల్లుతుంది. కాబట్టి డ్రింక్ చేసే సమయంలో కాల్చిన చికెన్, కూరగాయలు వంటివి తినడం మంచిది.

Fried foods may taste good, but they up your chance of having major cardiovascular problems, such as a heart attack, by 28 percent - Fyne Fettle

 1. బ్రెడ్‌తో బీర్ డేంజర్
  బ్రెడ్, బీర్ హానికరమైన కలయిక. మద్యం తాగే సమయంలో దీన్ని కూడా ట్రై చేయకూడదు. ఇది తినడం వల్ల అపానవాయువు వస్తుంది. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేసేస్తుంది. బీరుతో రొట్టెలు ఎక్కువగా తీసుకుంటే వాంతులు కూడా వస్తాయి జాగ్రత్త.

Yeast-devouring gut bacterium may provide new Crohn's treatments

 1. కాఫీ, వైన్
  కాఫీ, ఆల్కహాల్ కూడా మంచి పెయిర్ కాదు. కాఫీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అధికంగా మద్యం సేవించే వాళ్లు, డ్రింక్ చేసే సమయంలో కాఫీ తాగకపోవడం ఉత్తమం.

There's Now a Wine Made with Cold Brew Coffee | HelloGiggles