టీఆర్ఎస్‌కు ఆ జిల్లా సర్పంజ్ రాజీనామా

చెన్నూరు: టీఆర్ఎస్ పార్టీకి మంచిర్యాల జిల్లాలో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలోని గంగారం గ్రామ సర్పంచ్‌ దుర్గం నగేష్‌.. గులాబీ పార్టీకి వీడ్కోలకు పలికారు. శనివారం నాడు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని, ఈ కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎంపీపీకి పంపినట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌ పార్టీని వీడానని, అప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరానని ఆయన చెప్పారు. కానీ గులాబీ పార్టీలో కూడా సరైన గుర్తింపు లేకుండా పోయిందని, దీనికితోడు అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అభివృద్ధి విషయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నానని ఆయన అన్నారు. ఈ కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు నగేష్‌ వెల్లడించారు.