ముగిసిన అంతర్జాతీయ చెస్‌ పోటీలు

వరంగల్: అంతర్జాతీయ చెస్‌ పోటీలు ముగిశాయి. రాష్ట్రం తరపున ఈ పోటీల్లో పాల్గొన్న మీసాల వంశీ కీలక ప్రతిభ కనబరిచాడు. ఇమెటర్నేషల్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో నిర్వహించిన అండర్‌ 10 అంతర్జాతీయ చెస్‌ పోటీలు గురువారంతో ముగిశాయి. బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన మీసాల వంశీ భారతదేశం తరపున పది రౌండ్లలో పాల్గొని ఆరు రౌండ్లలో విజయ సాధించినట్లు కోచ్‌ సీహెచ్‌.గోపీకృష్ణ, జ్యోత్స్న తెలిపారు.

‘ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన 227 మంది పాల్గొన్నారు. వంశీ ప్రతిభ చూపి ఆరు రౌండ్లలో గెలుపొందగా మూడు రౌండ్లలో ఓటమి చెందాడు. చివరి పదో రౌండ్‌ డ్రాగా ముగిసింది. దేశంలో ఎంపికైన 15 మంది క్రీడాకారుల్లో మన రాష్ట్రం నుంచి వంశీ మాత్రమే ఎంపికై ప్రతిభ కనబరిచాడ’ కోచ్ జ్యోత్స్న వెల్లడించారు.